**మహానాడు ప్రసంగంలో “తుడ” చైర్మన్
కడప (తిరుపతి): తెలుగువారికి పెద్ద పండుగ అయిన టీడీపీ మహానాడుతో దశ దిశ మార్పునకు శ్రీకారం చుట్టిందని, ఇందులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు నియామకంతో తెలుగుజాతి గర్విస్తోందని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడ) చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలే అధిష్టానంగా వెలుగొందుతున్న ఏకైక పార్టీ టిడిపి మాత్రమే అని తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కనుందని, మహానాడులో సీఎం ప్రసంగంతో పార్టీ కార్యకర్తల్లో నయా జోష్ వచ్చిందని చెప్పారు. తెలుగుజాతి దశ దిశ మార్చే సత్తా కేవలం సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరోమారు టిడిపి జాతీయ అధ్యక్షులుగా సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక కావడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అన్నారు. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఆయన చేస్తున్న సేవ అజరామరం అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలే అధిష్టానంగా భావించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రారంభానికి నోచుకోని కడప స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో ప్రారంభించి మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తానని గర్వంగా ప్రకటించిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం శుభ పరిణామమన్నారు. ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్తగా ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుందని తెలిపారు. మహానాడు చివరి రోజున కనీ విని రీతిలో సుమారు పది లక్షల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారని దివాకర్ రెడ్డి తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
