అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద భాగ్యలక్ష్మి కాలనీ కి చెందిన కె.కిరణ్ కుమార్ తండ్రి కె.కేదారి(41) ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వైద్య సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారుడు
కె.కిరణ్ కుమార్ కు 2.00 లక్షల రూపాయలను మంజూరు చేయించి లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూసేవారు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు విజయ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
