హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ లో ఉన్న GHMC వార్డు ఆఫీసు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ లో ఉన్న GHMC వార్డు ఆఫీసు వద్ద GHMC ENTOMOLOGY డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో “MONSOON FOGGING ACTION PLAN” కార్యక్రమాన్ని హైదర్ నగర్ డివిజన్ ప్రజల సమక్షంలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వర్షా కాలం ప్రారంభం అవుతుందని, డివిజన్ అంతా వారానికి ఒక రోజు కూకట్పల్లి సర్కిల్ లో ఉన్న అన్ని దోమల మందు యంత్రాలతో అన్ని కాలనీ లు ఒక రోజు దోమల మందు పిచికారి చేసే పైలట్ ప్రాజెక్ట్ నా చేతుల మీదుగా మొదలవడం చాలా సంతోషకరమని, ఈ సంవత్సరం ఒక్క డెంగ్యూ కేసు కూడా మన డివిజన్ లో లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేయాలని ENTOMOLGY వారికి సూచించడం జరిగింది అని నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ENTOMOLOGY వెంకటేశ్వర రావు, ఏఈ తేజశ్రీ, సూపర్వైజర్ పద్మ, హైదర్ నగర్ డివిజన్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

You cannot copy content of this page

Scroll to Top