రహదారుల నాణ్యతలో రాజీ పడవద్దు

Spread the love

రహదారుల నాణ్యతలో రాజీ పడవద్దు
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు డివిజన్లో చేపడుతున్న రహదారుల నిర్మాణ పనుల పరిశీలన..

పటాన్చెరు :జిహెచ్ఎంసి పరిధిలోని కాలనీలలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని.. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో కోటి 55 లక్షల రూపాయలతో చేపడుతున్న సిసి మరియు బి టి రోడ్డు నిర్మాణం పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.

రోడ్ల నిర్మాణ సమయంలో నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రమాణాలకు భిన్నంగా రోడ్డు నిర్మాణం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.

నిర్దేశిత గడువులోగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకునే రావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ శివకుమార్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top