ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మరియు మాజి మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ విప్

Spread the love

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మరియు మాజి మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ విప్ లుగా నియమితులైన సందర్భంగా హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలసారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటూ, చట్టసభలలో పార్టీ శ్రేయస్సు కోసం అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. ప్రజాసేవకు ఈ పదవి మరింత మార్గదర్శకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం హరీష్ రావు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కి మరియు మాజి మంత్రి సత్యవతి రాథోడ్ కి తన శుభాకాంక్షలు తెలియజేస్తు వారికి ఈ అవకాశం కల్పించిన కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ శ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు..

You cannot copy content of this page

Scroll to Top