ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు సృజనాత్మకతతో అద్భుతాలు

Spread the love

ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తారు వైద్య విజ్ఞాన ప్రదర్శన లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి

వనపర్తి :
విద్యార్థులను ప్రోత్సహిస్తే వారిలో దాగివున్న సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు సివి రామన్ టాలెంట్ స్కూల్లో ఏర్పాటుచేసిన వైద్య విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి
విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు .తెలంగాణ సంస్కృతులను,వృత్తి నైపుణ్యాలను,ఆధునిక కాలంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను విద్యార్థులు కన్నులకు కట్టినట్లు రూపొందించారు.విద్యార్థుల సృజనాత్మకతను చూసి మాజీ మంత్రి మురిసిపోయారు.శ్రద్ధగా ప్రదర్శన చూసి వివిధ విభాగాలలో విద్యార్థులు రూపొందించిన అంశాలును చూసి వారిని అభినందించారు.


విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు అని కొనియాడారు. సివి రామన్ టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది
ఇంత గొప్పగా వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని,అధ్యాపక బృందాన్ని అభినందించారు.
మాజీమంత్రి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,ప్రేమ్ నాథ్ రెడ్డి,కంచ.రవి,శివ లక్ష్మణ్ మరియు
స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మురళీధర్,డాక్టర్ శారద,డాక్టర్.హరికృష్ణ,డాక్టర్ ప్రత్యూష, డాక్టర్.సిద్ధార్థ, డాక్టర్.మౌనిక,సత్తార్ సార్,నవీన్ కుమార్,షబానా మేడం, జనజ్వాల.రాధాకృష్ణ,గంధం.నాగరాజుతదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top