సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాచుపల్లి వాసులు కేసి రెడ్డి బల్ రెడ్డి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను కేసి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, అంజాద్, పద్మ రావు, మోహన్, NSUI నాయకులు గొంగుల నవీన్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top