ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్!

Spread the love

ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్!

హైదరాబాద్:
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పోలింగ్ మొదలైంది ,

ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించను న్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. అదే సమయంలో, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది.

ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకోనున్నారు. వాటిలో3 వేలకు పోలింగ్‌ సెంటర్లను సమస్యాత్మకమైవనిగా గుర్తించి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు.

ఒకవైపు ఢిల్లీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంటే, పొద్దున్నే పూజల సందడి కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ యమునా ఘాట్‌ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి మనీష్‌ సిసోడియా కూడా పూజలు చేశారు.

కల్కాజీలోని ఒక ఆలయంలో సిసోడియా పూజలు నిర్వహించారు. ఇక, ఎన్నికల నేపథ్యంలో అయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిం చారు అధికారులు.

You cannot copy content of this page

Scroll to Top