వంశీ లాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిది

Spread the love

వంశీ లాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిది

ఏపీ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం –

వంశీ అరెస్ట్ అంశంపై ఏపీ ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంశీ మనిషి కాదని, ఆయన ఒక మృగమని అన్నారు. వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే చంపేసేవారని… ఇక్కడ కాబట్టి బతికిపోయాడని చెప్పారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి వంశీ అని అన్నారు.

పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా వంశీ డ్రామాలు ఆడాడని… డ్రెస్ మార్చుకుంటానని లోపలకు వెళ్లి ఫోన్లు చేసి, అల్లర్లకు పాల్పడాలని అనుచరులకు చెప్పాడని తంగిరాల సౌమ్య మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని, కార్లు తగులబెట్టారని, మనుషులను చంపేందుకు కూడా యత్నించారని అన్నారు. కేసు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ ని భయపెట్టాడని చెప్పారు.

వంశీ బతుకు ఇప్పుడు బయటపడిందని అన్నారు. ఇలాంటి వారిని శిక్షిస్తేనే సమాజానికి మంచిదని అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top