పూరి జగన్నాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

Spread the love

పూరి జగన్నాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు వి.చంద్రారెడ్డి

                          బొల్లారం మున్సిపాలిటీ వైయస్సార్ కాలనీలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మహా యజ్ఞోత్సవం-పార్శ్వ మందిరాల ప్రతిష్టోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.  జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్  తో కలిసి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి  జగన్నాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజారుల నుంచి వారు ఆశీర్వచనాలు పొందారు. దేవతామూర్తుల ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషనియమని అన్నారు. ఈ సందర్భంగా నాయకులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. స్థానిక భక్తులే కాకుండా నగరానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చక్రపాణి, లక్కన్, ధర్మేందేర్ యాదవ్, ఉమాకాంత్, సునీల్ సింగ్, తివారీ, బసంత్పెర, జితేందేర్ యాదవ్, సునీల్ సింగ్, అశ్వక్ యాదవ్, పద్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top