మాజీ మంత్రి హరీష్ రావ్ కి మెమోరాండం అందించిన ఇస్నాపూర్ మున్సిపల్ ఆటో డ్రైవర్ల సంఘం సభ్యులు
………………………………..
సాక్షిత పటాన్ చెరు : గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావ్ నివాసంలో ఆయనను కలిసి మెమోరాండం అందించి తమ సమస్యలను విన్నవించుకున్న ఆటో కార్మికులు 2024 లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు ఏడాదికి 12,000/- రూపాయలను మరియు ఇన్సూరెన్సు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా వారు ఇచ్చిన హామీని అమలుచేయకపోవడం వలన కుటుంబ పోషణ మరియు పిల్లల భవిష్యత్తుకు ఆధారం లేక అవస్థలు పడుతున్నామని ఆయనతో తమ కష్టాలను చెప్పుకున్నారు
ఆటో కార్మికుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తమకు ఇస్తామన్న జీవన భృతిని వెంటనే అమలుపరిచేలా చూడాలని వారు కోరారు
ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన హరీష్ రావ్ తప్పకుండా ఆటో కార్మికుల సమస్యలను తీర్చే దిశగా ప్రభుత్వం మెడలు వంచి కార్మిక వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచేలా మీ పక్షాన పోరాడి సాధించుకుందాం అని వారికి ధైర్యాన్ని ఇచ్చారు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో సంఘాలను ఏకం చేసి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
