నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని………….
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్ పిలుపు
వనపర్తి : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. ఆయన అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి గోడపత్రికలను కలిసి విడుదల చేశారు. జూలై రెండవ తేదీన అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ కార్యక్రమానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు. దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లే మోడీ విధానాలను ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ ప్రతిష్టతను సార్వభౌమత్యాన్ని దెబ్బతీసే విధంగా మోడీ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మౌనం వహించడం కని ప్రశ్నించారు. ఈ చర్యలను ఖండిస్తూ ఏఐఓఎఫ్ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుతుబ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైబు ఉదయ్ చేతన్ ప్రణీత్ పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
