షాపూర్‌నగర్ UPHC అభివృద్ధికి ఎమ్మెల్యే వివేకానంద్ తోడ్పాటు అభినందనీయం..
ప్రాథమిక వైద్య సేవల పునరుద్ధరణకు సహకారం అందిస్తాం – ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) అభివృద్ధి కోసం నేడు వైద్యాధికారి డా. నవనీత , MPHWF మరియు ANM సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో మౌలిక వసతుల మరమ్మతులు, ఆధునీకరణ అవసరాలను ఆమె వివరించారు. గతంలో పానీం, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ఇతర వసతుల అభివృద్ధికి గౌరవ ఎమ్మెల్యే తన స్వంత నిధులతో సహాయపడ్డారని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అవి పాక్షికంగా ధ్వంసమై మరమ్మతులకు అవసరం ఏర్పడిందని తెలిపారు.
విషయాన్ని సమగ్రంగా పరిశీలించిన ఎమ్మెల్యే , ప్రజారోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొంటూ, అవసరమైన మౌలిక వసతుల పునరుద్ధరణకు తగిన సహాకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఆసుపత్రి సేవలు మరింత మెరుగవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
