అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారామే నా ధ్యేయం

Spread the love

అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారామే నా ధ్యేయం – ఎమ్మెల్యే కె. పి. వివేకానంద..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ని కలిసేందుకు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు..

అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కి తాము జరుపుకునే శుభకార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజవర్గం నుండి వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top