జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయము……. జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజిని
వనపర్తి
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా పామపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, విద్యార్థులకు చట్టాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు ఆర్టికల్ (14), ఆర్టికల్ (19) మరియు ఆర్టికల్ (21) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ . ఈ ఆర్టికల్స్ ను గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ అంటారు అని తెలియజేశారు. అదేవిధంగా మహిళలకు, చిన్నపిల్లలకు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, వయోవృద్ధులకు, మతి స్థిమితం లేని వారికి, సామూహిక విపత్తు మరియు మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. మరియు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కొరకు NALSA 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమాలలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
