వనపర్తి: తృటిలో తప్పిన ప్రమాదం..!
వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో బస్ ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం వనపర్తి నుండి కొత్తకోట మీదుగా హైదరాబాద్ కు 3:15 సమయము లో (TS 21 Z 0067) బస్ బయలు దేరే క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయి బస్ రోడ్డు మీదికి దూసుకెళ్ళింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ వైపు మల్లించగా డివైడర్ ను తగలకముందే బస్ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురైన ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై వాహనాలు నిలిచి కాసేపు రహదారి స్తంభించింది. కాగా డ్రైవర్ ప్రయాణికులను దించి బస్ ను డిపోకు తరలించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
