శ్రీశ్రీశ్రీ హజరత్ కరిముల్లా షా ఖాదరి ఉరఫ్ కాలేషా పీర్ మస్తాన్ వలి దర్గాను సందర్శించిన షేక్ షoషూర్ దంపతులు
కనిగిరి నియోజకవర్గం పామూరు గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ హజరత్ కరీముల్లషా ఖాదరి ఉరఫ్ కాలేష పీర్ మస్తాన్ వలీ దర్గాలో రాత్రి పామూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షంషూర్ ధర్మపత్ని శ్రీమతి సైరా బాను లను దర్గా ముజావర్ గౌస్ భాయ్ పూలమాల వేసి సన్మానించి దుష్యాలవులతో సత్కరించి బాబా వారి చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా గౌస్ భాయ్ మాట్లాడుతూ దర్గా అభివృద్ధి కొరకు షంషూర్ దంపతులు తమ వంతు సహాయ సహకారాలు అందించారని, జనవరి 1వ తేదీన జరిగే కంబల్ గంధాన్ని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి బాబా వారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.
షంషూర్ దంపతులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గోపాలపురం లో బాబా వారి దర్శనం నిమిత్తం విచ్చేయు భక్తులకు, సకల శుభాలు, చీడ, పీడ సోకిన వారిని బాబా ప్రార్థనలతో ప్రారదోలుతు భక్తుల విశేష మన్ననలు పొందుతున్న గౌస్ భాయ్ ని అభినందించారు. గోపాలపురంలోని దర్గాలో బాబా వారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవలసిన ఆవశ్యకత ఉందని, బాబా వారి దర్శనంతో సకల చీడ, పీడ లు తొలగి పోయి సకల సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులకు అపారమైన నమ్మకమని షంషూర్ తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
