పీజేఆర్ నగర్లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్లో డ్రైనేజ్ లైన్ డామేజ్ అయి సమస్యగా ఉందని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజ్ లైన్ మధ్య మధ్యలో పైపులు పగిలి సమస్య ఏర్పడిందని వెంటనే కొత్త పైపులు అమర్చి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా కాలనీలో నివాసాలు పెరిగి, డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోతుంది కాబట్టి పెద్ద డ్రైనేజీ లైన్ ను నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. డ్రైనేజ్ లైన్ కొరకు వెంటనే ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో CH.భాస్కర్, ప్రదీప్ రెడ్డి, నస్రీన్, సతీష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
