సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీపీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకుడు సురేష్ ఆధ్వర్యంలో రాత్రి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . వీరులందరికీ రమేష్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందన్నారు. ఉచిత బస్సు, ఉచిత కరెంటు ,కళ్యాణ లక్ష్మి ,ఆరోగ్యశ్రీ ,వంటి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేంద్ర,కాంగ్రెస్ సీనియర్ నాయకులు టోచర్, ఏ బ్లాక్ అధ్యక్షురాలు రమాదేవి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాదా, మైనారిటీ నాయకులు పర్వేజ్, కాంగ్రెస్ యూత్ నాయకులు భరత్, సురేష్, ఏం సి డైరెక్టర్ రాజేందర్ ,సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
