తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన దామోదర్ రెడ్డి ని కూకట్పల్లి నియోజకవర్గ కార్యాలయం హేమ దుర్గాభవన్లో టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బoడి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన దామోదర్ రెడ్డిని అభినందించారు. శాలువాతో సత్కరించారు. దామోదర్ రెడ్డి ఎన్నికల ముందు వరకు హైదరాబాద్ కూకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రాంతాల్లో రాజ్ న్యూస్ రిపోర్టర్ గా పని చేసేవారు రాష్ట్రంలో పంచాయితీలకు ఎన్నికలు ప్రకటించడంతో ఎన్నికల్లో పాల్గొన్న దామోదర్ రెడ్డి తన స్వగ్రామం నుంచి ప్రెసిడెంట్ గా గెలుపొందారు. తనను కలిసిన దామోదర్ రెడ్డిని అభినందిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి మేర కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, రాఘవేంద్ర, విటల్ రెడ్డి, మొయినుద్దీన్, హమీద్, కొండల్ రెడ్డి, కిట్టు, రజినీకాంత్ ,తిరుపతయ్య, మధుమోహన్, వినయ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top