రెండున్నర లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు
ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన చెన్ బసప్ప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ఓసిని శనివారం సాయంత్రం పటాన్చెరు లోని తన కార్యాలయంలో బసప్ప కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, నర్సింలు, రాజన్ సింగ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
