మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపల్ కమిషనర్లు
శంకర్పల్లి: మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ లు యోగేష్, వెంకటేష్ శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్ లు కలిసి వారికి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాలను బహుకరించారు. వారు మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని, స్వామివారిని కోరుకున్నట్టు తెలియజేశారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
