వ్యవసాయంలో యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి ఒక ప్రకటనలో తెలిపారు.
యూరియాను శాస్త్రీయ నిష్పత్తి (4:2:1) కి బదులుగా రైతులు విపరీతంగా (7:2.8:1) వాడుతున్నారన్నారన్నారు. దీనివల్ల నేల నిస్సారం కావడం, తెగుళ్లు పెరగడం, పెట్టుబడి ఖర్చు పెరగడం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. దీనిలో భాగంగా 500 ఎమ్ఎల్ బాటిల్ నానో యూరియా 45 కిలోల బస్తా యూరియాతో సమానమని అన్నారు. భూసార పరీక్షల ద్వారా 20% వరకు యూరియా వాడకాన్ని తగ్గించవచ్చున్నారు. వేప పూత పూసిన యూరియా (నీమ్ కోటెడ్ యూరియా) వాడకం వల్ల నత్రజనిని మొక్కలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంచుతుందన్నారు. యూరియా అనేది పంటకు మందు లాంటిదని, మోతాదు మించితే విషంగా మారుతుందని అన్నారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయం కోసం శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఉప కులపతి డా. శారదా జయలక్ష్మి దేవి ఆ ప్రకటనలో తెలిపారు..
జారీ చేసినవారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
