ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని (మాఘ శుద్ధ విదియ) పురస్కరించుకుని, అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్. .

నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

సమాజ శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం అహింసా మార్గంలో అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారని, “అహింసా పరమోధర్మః” అనే నినాదంతో సమాజ హితం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె మార్గం నేటి మహిళా సాధికారతకు, సామాజిక బాధ్యతకు దిక్సూచి అని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు

You cannot copy content of this page

Scroll to Top