పల్నాడు జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ బి.రవి ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, ఓపీ, ఐపీలో అందుతున్న వైద్య సేవలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (EHR) వాడకం గురించి విచారించారు. ఇన్‌పేషెంట్లకు అందుతున్న సేవల గురించి ఆరా తీసుకుని, రోజువారీ హాజరు గురించి తెలుసుకున్నారు.గర్భిణీ స్త్రీల ఆమోదు తగ్గకుండా చూడాలని, పీహెచ్‌సీలోనే కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి గర్భిణీకి ఆభ(ABHA) ఐడీలు తప్పనిసరిగా నమోదు చేయాలని డా.రవి ఆదేశించారు. పీహెచ్‌సీ ఆవరణలో నిర్మిస్తున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) నిర్మాణ పురోగతిని కూడా పరిశీలించారు.సిబ్బందికి ఇచ్చిన అన్ని లక్ష్యాలు పూర్తి చేయాలని తగిన సూచనలు చేశారు. మరోవైపు, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో కొండవీడు ఫెస్ట్‌కు మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, మందులు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
