వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల
వనపర్తి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ,
కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సరైన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
బుధవారం జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి, సాధారణ ఎన్నికల పరిశీలకులు జి. లక్ష్మీ బాయి తో కలిసి వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, ఓట్ల లెక్కింపు కేంద్రం కొరకు నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశాల మైదానం, పెద్ద పెద్ద హాళ్లు ఉన్నందున పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కొరకు వాడుకోవచ్చని నిర్ధారించారు. ఒక్కో రూట్ వారిగా టెంట్, టేబుల్ ఏర్పాటు చేసి మెటీరియల్ పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
కౌంటింగ్ కొరకు టేబుళ్ళ ఏర్పాటు, బారికెడింగ్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంలో సి.సి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు , ఆర్.అండ్ బి కార్యనిర్వాహక ఇంజనీరు దేశ్యా నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, మున్సిపల్ డి.ఈ మహమ్మద్ యూనిస్, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, సి. ఐ, ఎస్. ఐ లు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
