ఘనంగా విజయ గణపతి దేవాలయం 21వ వార్షికోత్సవం
కనులపండువగా స్వామివారి కళ్యాణం.
కోదాడ పట్టణంలోని శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయ 21వ వార్షికోత్సవం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామునే స్వామివారికి విశేష అభిషేకములు, గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిపారు. తీరొక్క పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చలపటి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, అన్నదాత ఓరుగంటి బ్రహ్మం, కోశాధికారి వంగవీటి లక్ష్మణరావు, కొక్కు లక్ష్మీనారాయణ, చలపాటి శివకుమార్, భాస్కర్ రావు, సుందరి వెంకటేశ్వర్లు, బుడిగం వెంకటరమణ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
