
ఏప్రిల్ 14న నిర్వహించు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలి….
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి// :
ఏప్రిల్ 14న జిల్లా కేంద్రంలో నిర్వహించు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 14న. ఉదయం గం.10-00 లకు బస్ స్టాండ్ వద్ద అంబేడ్కర్ చౌరస్తా లో నిర్వహించు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
