
క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి//:.రామగుండం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి నాగ్ల మల్యాల స్వర్ణలత, తనపై అధికారుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ,
దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు అందాయని. ఈ ప్రవర్తన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని ప్రాథమిక విచారణలో తేలిందని, ఉన్నతాధికారుల నివేదికలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి సదరు అంగన్‌వాడీ టీచర్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో తెలిపారు.
ఈ సస్పెన్షన్ ఆదేశాలు సదరు టీచర్‌పై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యి, తదుపరి చర్యలు తీసుకునేంత వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణ తప్పినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
