మక్కాన్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేశారు

Spread the love

మక్కాన్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేశారు…

సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని మక్కాన్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో గుండా కీర్తి, పొడిచెట్టి జేరుష వివాహ సందర్భంగా పుస్తె మట్టెలు సహాయం అందించారు.

ఈ సందర్భంగా వధూవరులకు అవసరమైన పూలు, పండ్లు, చీర, పసుపు, కుంకుమ వంటి వస్తువులను మక్కాన్ సింగ్ సేవ సమితి సభ్యులు అందజేశారు.

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని మక్కాన్ సింగ్ సమితి సభ్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవ సమితి ఆధ్వర్యంలో కొనసాగిస్తామని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top