
ఘనంగా మాఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎరిక్షన్ బాబు.
యర్రగొండపాలెం పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ…
రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, వ్యవసాయం మరియు యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని, నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అయన కారణజన్ముడని కొనియాడారు.
అనంతరం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 76వ జన్మదిన సందర్భంగా 76 లక్షల రూపాయలను అన్న క్యాంటీన్‌లకు అందజేసి రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించగా, అందులో భాగంగా యర్రగొండపాలెంలోని అన్న క్యాంటీన్‌లో ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
