
ఐకెపి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏపీఎం మధుసూదన్
నల్గొండ : మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం మధుసూదన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహిస్తున్న కాంటాలను పరిశీలించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు. తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. ధాన్యం కొలతల్లో ఎటువంటి తేడాలు ఉండకుండా ఖచ్చితత్వం పాటించాలని సూచించారు.
రైతుల సమయాన్ని హృదాచేయకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో పారదర్శకత ఉండేలా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, తేమ శాతం మరియు నాణ్యత పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమాచారం ముందుగానే అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాంటాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఎం మధుసూదన్ హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే ప్రధానంగా భావించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఐకెపి కేంద్రాలను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
