
- బాపట్ల పర్యాటక ముఖచిత్రంగా “Bay of Bapatla” లోగో
…
- బాపట్ల జిల్లాను అంతర్జాతీయ స్థాయి బీచ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన “Bay of Bapatla” లోగో ఆకట్టుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐఏఎస్ గారు తెలిపారు. ప్రకృతి అందాలు, చారిత్రక వారసత్వం, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ ఈ లోగోను రూపొందించినట్లు చెప్పారు.లోగోలో కనిపించే ఉదయించే సూర్యుడు, సూర్యకిరణాలు సూర్యలంక బీచ్లో కనిపించే మనోహరమైన సూర్యోదయాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఇది బాపట్ల పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు, అభివృద్ధిని సూచిస్తోందన్నారు. “Bapatla” పదంలోని “A” అక్షరాన్ని పురాతన చరిత్ర కలిగిన భావన్నారాయణ స్వామి ఆలయ గోపుర ఆకృతిని పోలి ఉండేలా సృజనాత్మకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.లోగో దిగువన ఉన్న అలల ఆకృతి సముద్రతీర అందాలను, ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. బాపట్ల పర్యాటకానికి ప్రత్యేక విజువల్ ఐడెంటిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ లోగోను రూపొందించినట్లు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
