
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సిపిఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షలో వరుసగా జరుగుతున్న అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ తీవ్రంగా ఖండించారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అపారమైన శ్రమ, ఖర్చుతో ఈ పరీక్షకు సిద్ధమవుతుంటే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాస్ కాపీయింగ్, మార్కుల మానిప్యులేషన్ వంటి ఘటనలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు.
బీజేపీ మోడీ ఆవలంబిస్తున్న విధానాలు విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టివేయడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలహీనపరచడం వల్లే ఇటువంటి అవినీతి పెరుగుతోందని ఉమా మహేష్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభకు న్యాయం జరగాలంటే పరీక్షల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత ఉండాలని, కేంద్ర ప్రభుత్వం మరియు National Testing Agency (NTA) వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన అక్రమాలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అక్రమాలకు బీజేపీ పూర్తిగా సహకరిస్తున్నట్లు కనిపిస్తుందని,మేము నిజాయితీ పరులం అని అబద్దాలు చెప్పుకోవడం బీజేపీ కె చెల్లిందని,నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధానాలను సహించబోమని, అవసరమైతే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని ఉమా మహేష్ హెచ్చరించారు.
ఉమా మహేష్
సిపిఐ జిల్లా కార్యదర్శి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
