
ఐటీఐ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన
స్కిల్ డెవలప్‌మెంట్ వర్చువల్ మీటింగ్ విజయవంతం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ వర్చువల్ మీటింగ్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వర్చువల్ మీటింగ్ కార్యక్రమానికి కళాశాల నుండి 255 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవసరమైన వివిధ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ కోర్సులపై పూర్తి అవగాహన కల్పించారు.
అలాగే దేశ సేవలో భాగస్వామ్యం అయ్యేందుకు అగ్నివీర్ నియామకాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్, పారా మిలిటరీ ఫోర్సెస్‌లో ఉన్న విభిన్న కెరీర్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు సవివరంగా వివరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, వైస్ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
