
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు..
ఎమ్మెల్యే చోరవతో విగ్రహ ఏర్పాటు పనులు కొనసాగింపు
వనపర్తి :
వనపర్తి జిల్లా కేంద్రంలోని మరికుంట మెడికల్ కాలేజీ చౌరస్తా వద్దతెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ ఉద్యమకారుడు లక్కాకుల సతీష్‌కు బాధ్యతలు అప్పజెప్పడంతో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయొద్దని పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు… విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని
తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వనపర్తి లో ఏర్పాటు
చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదు నిబంధనలు అడ్డు వస్తే నాపై మరియు ఉద్యమకారుడు లక్కాకుల సతీష్ పై కేసులు పెట్టమని ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు తెలంగాణ కోసం ఎందరో అమరులైనారు వారి త్యాగ ఫలితాలతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని ఆయన ఫారెస్ట్ అధికారులకు గుర్తు చేశారు. ఎమ్మెల్యే చొరవతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటు పనులు సజావుగా కొనసాగాయిఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు లక్కుకుల సతీష్ 5వ వార్డు కౌన్సిలర్ బాపని పల్లి వెంకటేష్,4వ వార్డు కౌన్సిలర్ శరవంద,30వ వార్డు కౌన్సిలర్ క్రాంతి గౌడ్, మాజీ కౌన్సిలర్ విబుది నారాయణ,జంగిడి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు….
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
