
రాజీవ్ గాంధీ ఆశయల సాధనకు కృషి చేయాలి…..మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు…
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు అన్నారు. వారి నివాసంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక వార్డు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కౌన్సిలర్లు తోట శ్రీను,కోటిరెడ్డి, కందుల కోటేశ్వరరావు, హరి ప్రసాద్,పాశం శ్రీను, గుండాపూనేని నాగేశ్వరరావు,గంధం పాండు, వంగూరి గోపి, షాబుద్దీన్, సుశీల రాజు, ఉప్పగండ్ల శ్రీను,ముస్తఫా, జనార్ధన్, అలీ భాయ్, కాంపాటి శ్రీను, బాజాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
