
గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే
వనపర్తి పట్టణంలోని జాగృతి కళాశాల కరస్పాండెంట్ వినోద్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, సత్యనారాయణ స్వామి వ్రత తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వినోద్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన గృహంలో ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కల అని, మనం కన్న కలలకు అనుగుణంగా గృహాన్ని నిర్మించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు.
సొంత ఇంటి నిర్మాణం కోసం ఏళ్ల తరబడి వేచి చూసి మనకున్న స్థాయిలో అందమైన ఇంటిని నిర్మించుకోవడం ఎంతో ఉత్తమమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
