విక్రమ్ ఆకస్మిక మృతి బాధాకరం

Spread the love

విక్రమ్ ఆకస్మిక మృతి బాధాకరం

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి
నియోజకవర్గంలోని ఖిల్లా ఘణపురం మండలానికి చెందిన నాయకులు విక్రమ్ ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత బాధాకరమని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి విచారం వ్యక్తం చేశారు

ఎమ్మెల్యే ఖిల్లా ఘణపురంలోని విక్రమ్ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విక్రమ్ ప్రజలతో మమేకమై పనిచేసే మంచి వ్యక్తి అని, ఆయన మరణం బాధాకరమని, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కల్పించారు

కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top