
9న. పెద్దపల్లి పర్యటనకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్…
దళిత సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని బొంకూరి మధు విజ్ఞప్తి…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు ఈ నెల 9న పెద్దపల్లి జిల్లాకు రానున్నట్లు వెల్లడైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశంలో వారు పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్, కుష్రం నీలాదేవి, రాంబాబు నాయక్, జిల్లా శంకర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో దళితులపై జరుగుతున్న కుల వివక్ష, అంటరానితనం, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల ఉదాసీనత, అలాగే కొన్ని గ్రామాల్లో ఆధిపత్య కులాల పెత్తనం వంటి సమస్యలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లాలని దళిత సంఘాలు, ప్రజాసంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని దళిత వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రతి ఒక్కరూ తమ ఫిర్యాదులు, సమస్యలను ఆధారాలతో కమిషన్ ముందుంచాలని ఆయన కోరారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కమిషన్‌కు తమ వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
