ఈ–కేవైసీ చేయించుకోండి… లేదంటే రేషన్ బంద్

TEJA NEWS

ఈ–కేవైసీ చేయించుకోండి… లేదంటే రేషన్ బంద్!

  • జూలై 31 చివరి గడువు..
  • FSC లబ్ధిదారులు వెంటనే (e-KYC) పూర్తి చేయాలని అధికారుల ఆదేశం

వనపర్తి జిల్లాలోని ఆహార భద్రత (FSC) కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని జిల్లా అధికారులు సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 75.75 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 24.25 శాతం మంది లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోపు తమకు కేటాయించిన రేషన్ దుకాణంలో ఈ–కేవైసీ పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు అనంతరం నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తహసీల్దార్లు, రేషన్ డీలర్లు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన లబ్ధిదారులతో ఈ–కేవైసీ పూర్తి చేయించాలని అధికారులు సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top