
ఈనెల 27వ తేదీన నారా లోకేష్ బాబు పునాదిపాడు పర్యటనను జయప్రదం చేయండి – తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.
పెనమలూరు నియోజకవర్గం, పునాదిపాడులో స్కూల్ ఓపెనింగ్ కి విచ్చేయుచున్న విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు పర్యటనను విజయవంతం చేయాలని కాటూరు, కలవపాముల, బోల్లపాడు గ్రామాల్లో స్థానిక తెదేపా నాయకులతోపాటు పర్యటించి నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించిన రాజేంద్రప్రసాద్ .
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
యువగళం పాదయాత్రతో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు అని, విద్యాశాఖ మంత్రిగా అధునాతన విద్యను పిల్లలకు అందిస్తూ, ఐటీ శాఖ మంత్రిగా పలు కంపెనీలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చేదోడు నారా లోకేష్ బాబు ఉంటున్నారని, మరి అలాంటి యువనాయకులు మన పెనమలూరు నియోజకవర్గం వస్తున్న సందర్భంగా మనమందరం పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం చెప్పి పెనమలూరు నియోజకవర్గ పార్టీ క్యాడర్ బలమేంటో చూపిద్దామని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు వెనిగళ్ళ కుటుంబరావు, 10 వ క్లస్టర్ ఇంచార్జ్ వేమూరి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్, జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజుల పాటి ఫణి, కలవపాముల గ్రామ పార్టీ అధ్యక్షులు ఘంట పూర్ణయ్య, సొసైటీ అధ్యక్షులు కలపాల మల్లేశ్వరరావు, యూనిట్ 49 ఇంచార్జ్ తాబేటి శేఖర్, వంగ శివార్జున రెడ్డి, బొల్లపాడు సొసైటీ అధ్యక్షులు గుంటకల్ లక్ష్మారెడ్డి, రైతు కమిటీ అధ్యక్షులు సూరపనేని శేష వరప్రసాద్, ఏఎంసి డైరెక్టర్ పామర్తి శ్రీనివాసరావు, చేబత్తిన పండు, రావెల వరుణ్ కుమార్, వాత్సవాయి ఏడుకొండలు, తుమ్మలచెర్ల హరీష్, పారేపల్లి వెంకటేశ్వరరావు, షోలే నాని, రంప విష్ణు,రంప శ్రీను,పాగోలు రాజేష్, పోతురాజు, రాము, నత్త శంకర్,చిరంజీవి రెడ్డి, అక్కయ్య, మెరుగు కిరణ్, పి ఆర్ పి,చింతలపూడి జగదీష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
