గార్ల మండలంలో SIR ప్రక్రియను పరీశీలించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య ,ఇల్లందు SIR కో.ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు

Spread the love

గార్ల మండలంలో SIR ప్రక్రియను పరీశీలించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య ,ఇల్లందు SIR కో.ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు

మహబూబ్ బాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలంలోని మర్రిగూడ,గార్ల గ్రామాలలో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కోనకయ్య ,ఇల్లందు SIR కో-ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు పరీశీలించారు..నేరుగా ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి అవగాహన కల్పించి,ఓటర్ ఫారాలు నింపారు..

ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి బీఎల్ఏలు,బూత్ సూపర్‌వైజర్ల పనితీరును సమీక్షించారు..ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్పించాలని సూచించారు..18 ఏళ్లు నిండిన యువతను గుర్తించి ఫారం-6 ద్వారా నమోదు చేయించాలని, డూప్లికేట్ ఓట్లు,మరణించిన వారి పేర్లు ఫారం-7 ద్వారా తొలగించాలని ఆదేశించారు.

ఏ ఒక్క అర్హుడి ఓటు గల్లంతు కాకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు…

You cannot copy content of this page

Scroll to Top