సూరారం డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి అమృత రెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని సూరారం డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి అమృత రెడ్డి మరియు వారి కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు భవిష్యత్ కార్యాచరణపై వారు మాజీ ఎమ్మెల్యే తో చర్చించారు. నూతన బాధ్యతలు చేపట్టిన అధ్యక్షురాలు శ్రీమతి అమృత రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ శుభాకాంక్షలు తెలియజేసి, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శంకర్ రావు జనరల్ సెక్రటరీ, ఇంద్రసేన గుప్తా,వెంకటప్ప రెడ్డి, సాయిరాం రాఘవ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాంబశివరావు మరియు కాంగ్రెస్ నాయకులు చౌడా శ్రీనివాసరావు, నాగిళ్ల శ్రీనివాస్, ఉలిపి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top