గురు పౌర్ణిమ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

గురు పౌర్ణిమ సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

గురు పౌర్ణిమ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో, ముఖ్యంగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, శాంతి, సుభిక్షాలు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top