ప్రభుత్వ బడులకు 100 బెంచీలు..

Spread the love

ప్రభుత్వ బడులకు 100 బెంచీలు..

ముప్పవరపు సంస్థ సేవలు అభినందనీయం

కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలకు 100 బెంచీలు అందజేసిన ముప్పవరపు ఫౌండేషన్ సేవలను కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముప్పవరపు ఫౌండేషన్‌ను కోరారు. బుచ్చిరెడ్డిపాళెం డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బెంచీల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కోవూరు ప్రభుత్వ బాలికల పాఠశాల, బుచ్చిరెడ్డిపాళెం డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాలకు మొత్తం 100 బెంచీలను ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్‌ బాబు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముప్పవరపు వెంకయ్యనాయుడుకి, ఆయన కుటుంబ సభ్యులకు, ముప్పవరపు ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఫౌండేషన్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన బెంచీలను అందజేయడం కూడా మంచి కార్యక్రమమని అన్నారు.విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి ముప్పవరపు కుటుంబం నెల్లూరు, వెంకటాచలం సమీపంలోని స్వర్ణ భారత్‌ ట్రస్టు ద్వారా కూడా ఎంతో మందికి సేవలందిస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి, కోడూరు కమలాకర్ రెడ్డి, కె.వి శేషయ్య, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top