ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2ను సమన్వయంతో పూర్తి చేయాలి…..

Spread the love

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2ను సమన్వయంతో పూర్తి చేయాలి…..

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్ష….

—ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియను సమర్థవంతంగా, సమన్వయంతో పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ సూచించారు. ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లు పాల్గొని ఫేజ్‌-2కు సంబంధించిన ప్రక్రియ, ఇప్పటివరకు జరిగిన పురోగతి, చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించుకుంటూ, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాజ్‌ఠాకూర్ కోరారు.

ఈ సమావేశంలో రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top