మెకానిక్‌ల సంక్షేమానికి అండగా ఉంటాం

మెకానిక్‌ల సంక్షేమానికి అండగా ఉంటాం
టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మేయర్ మహంకాళి స్వామి…

మెకానిక్‌లకు టీషర్టులు, గుర్తింపు కార్డుల పంపిణీ…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : ద్విచక్ర వాహనాల మెకానిక్‌ల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని రామగుండం నగర మేయర్, టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహంకాళి స్వామి అన్నారు.

గోదావరిఖని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ రామగుండం–గోదావరిఖని ఆత్మీయ సమ్మేళనానికి మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు మెకానిక్‌ల లోగోతో కూడిన టీషర్టులు, గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ మెకానిక్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అసోసియేషన్ సభ్యుల ఐక్యత, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు జంజర్ల గణేష్, బైరెడ్డి సమిరెడ్డి, అధ్యక్షుడు రెడ్డి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.డి. జాఫర్, ప్రధాన కార్యదర్శి మాతంగి శివరాజ్, సంయుక్త కార్యదర్శి ఆరెపల్లి కుమార్, కోశాధికారి సంజీవరెడ్డి, ప్రచార కార్యదర్శి గోపిశెట్టి సంతోష్, కార్యవర్గ సభ్యులు భాస్కర్, సత్యం, స్వామి, సురేష్, సిరాజ్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top