సింగరేణి కార్మికుల సేవలకు సెల్యూట్‌….

సింగరేణి కార్మికుల సేవలకు సెల్యూట్‌….

దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు అభినందనీయులు…

వాకిలిపల్లి గనిలో కార్మికులకు రాఖీలు కట్టిన బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య….

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వాకిలిపల్లి సింగరేణి బొగ్గు గనిలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, సిబ్బంది, నాయకులను కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఐటీఎన్ క్లేన్ కాలనీ చౌరస్తాలో ప్రజలకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోమారపు లావణ్య మాట్లాడుతూ “సిరుల సింగరేణి”గా పేరుగాంచిన సింగరేణి సంస్థ దేశానికి వెలుగులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తూ దేశ అభివృద్ధికి తమ శ్రమను అందిస్తున్న సింగరేణి కార్మికుల సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి సింగరేణి కార్మికుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

కార్మికులు, ప్రజలతో రాఖీ పండుగను జరుపుకోవడం ద్వారా సోదరభావం, ఆత్మీయత మరింత బలపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్, దాసరి శ్రీను, ఆరెగెళ్ల శ్రవణ్‌కుమార్, ముల్గురి వీరయ్య, వెంకటి, స్వామి, సురేష్, ఏల్పూరి రాజయ్య, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వడ్డపల్లి భారతి, మహిళా మోర్చా నాయకురాలు పద్మ, వేల్పూరి సరిత, మంజుల, సుశీల, సుధాశ్రీ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top