
మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం…
ఎస్‌ఐఆర్ రెండో దశపై బూత్ స్థాయి ప్రతినిధులకు శిక్షణ….
పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి…
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రెండో దశ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయి ప్రతినిధులకు గోదావరిఖనిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ “మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం” అనే లక్ష్యంతో ఎస్‌ఐఆర్ రెండో దశ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడాలని అన్నారు.
అనర్హులు, మరణించిన వ్యక్తుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ శిక్షణలో అందిస్తున్న మార్గదర్శకాలను బూత్ స్థాయి ప్రతినిధులు పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
